ఓరి నాయనో..ఇదేం కుర్చీలు రా బాబు..

-

కొన్ని కంపెనిలు పని పూర్తీ చెయ్యాలని తమ ఉద్యోగులకు ఒత్తిడి పెడతారు..దాంతో ఉద్యోగులు ఈ పని నా వల్ల కాదు..పని చేస్తూనే చనిపొతానేమో అంటూ ఉంటారు..అది అక్షరాల నిజం..కొన్ని సార్లు పని భారం పెరగడంతో స్ట్రెస్ ఎక్కువ అవ్వడంతో గుండె పోటు మృతి చెందడం మనం చూస్తూనే ఉంటాం..అయితే సీరియస్‌గా కాకుండా చిరాకులో ఉన్నప్పుడు ఇటువంటి మాటలు అంటుంటారు. అయితే యూకేలోని చైర్ బాక్స్ కంపెనీ మాత్రం ఉద్యోగుల అలాంటి మాటలను సీరియస్‌గా తీసుకుంది. ఏకంగా శవపేటికల లాంటి కుర్చీలను ఉద్యోగుల కోసం రెడీ చేసింది. దీంతో ఎవరైనా ఉద్యోగి ఆ కుర్చీలో కూర్చొని మరణిస్తే సమాధి దగ్గరకు తీసుకెళ్లడానికి వీలుపడుతుందని కంపెనీ తెలిపింది.

కాగా,శవపేటిక ఆకారంలో ఉన్న ఆఫీసు కుర్చీ ఫొటోలను చైర్ బాక్స్ కంపెనీ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ శవపేటిక కుర్చీ యొక్క ప్రత్యేకతను వివరిస్తూ కంపెనీ…”మేము మా కొత్త ఉత్పత్తిని పరిచయం చేయడం సంతోషంగా ఇది చివరి షిఫ్ట్ ఆఫీస్ చైర్. ఒక ఉద్యోగి పనిలో చనిపోతే, మేనేజ్‌మెంట్ టాప్ కవర్‌ ను దానికి వేసి, ఆ కుర్చీ టైపు శవపేటికను కార్పొరేట్ స్మశానవాటికకు తరలించాలి. సరళమైనది అయినప్పటికీ సమర్థవంతమైనది”అని తెలిపారు.

యూకె కంపెనీ చైర్‌బాక్స్ ఈ కుర్చీని తయారు చేసింది. దీనికి “ది లాస్ట్ షిఫ్ట్ ఆఫీస్ చైర్” అనే ట్యాగ్‌లైన్ ఇవ్వబడింది. ఎక్కువ సేపు కంప్యూటర్‌ ముందు కూర్చుని పనిచేసే వారి కోసం ఇది రూపొందించబడింది. ఇది శవపేటిక రూపకల్పనతో పేటికపై నిర్మించబడింది. కుర్చీ యొక్క 3D మోడల్ ఆఫీస్ కుర్చీని శవపేటిక రూపంలో చూపుతుంది, ఈ కుర్చీ యొక్క చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా గా మారాయి. అయితే ఈ ఫొటోలను చూసిన కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికి ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/CilCNaDjOBL/

 

Read more RELATED
Recommended to you

Latest news