చనిపోయిన వ్యక్తి ముక్కులో కాటన్‌ ఎందుకు పెడతారు..?

-

మనిషి చనిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా ఇంట్లో ఉంచుకోలేరు. ఒకవేళా ఉంచాలంటే.. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చూసే ఉంటారు.. మృతదేహానికి రెండు కాళ్ల బొటనివేలను కడతారు, ముక్కులో కాటన్‌ పెడతారు. కానీ ఇలా ఎందుకు..? చనిపోయిన వారి ముక్కులో కాటన్‌ ఎందుకు పెడతారు..? దీని వెనుక ఉన్న కారణం ఏంటి..?

మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలను పురాణాలు పేర్కొంటున్నాయి. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన అనంతరం మృతుడి కుటుంబీకులు కొందరు పూజలు కూడా చేస్తారు. చనిపోయిన వారి ముక్కులో కాటన్‌ పెట్టడం వెనుక శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి.

ముందుగా శాస్త్రీయ కారణాన్ని చూద్దాం. నిజానికి మరణం తర్వాత ఒక వ్యక్తి చెవులు, ముక్కు నుండి ఒక ప్రత్యేక ద్రవం బయటకు వస్తుంది. ఈ ద్రవం ప్రవాహాన్ని ఆపడానికి ఇలా పత్తిని పెడతారు. దీంతో పాటు మరణానంతరం శరీరంలోకి ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా ముక్కు రంధ్రాలు, చెవులను దూదితో కప్పి ఉంచుతారని అంటారు. దీని వలన శరీరం త్వరగా పాడైపోకుండా ఉంటుందని చెబుతారు.

ఇప్పుడు దీని వెనక ఉన్న ఆధ్యాత్మికత ఏంటో చూద్దాం.. మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి కలగాలని ముక్కు దగ్గరలో చిన్న బంగారు ముక్కలను ఉంటేవారట. ముక్కలు కింద పడకుండా ఉండేందుకు వాటి ముందు పత్తిని ఉంచేవారు. ముక్కులో దూది పెట్టుకోవడానికి ఇది కూడా ఓ కారణమని పెద్దలు చెబుతారు. అయితే చనిపోయిన వ్యక్తి తనతో ఏమీ తీసుకుపోలేడు. చనిపోయిన వ్యక్తికి ప్రాపంచిక విషయాలతో సంబంధం లేదని గరుడ పురాణం పేర్కొంది. కాలక్రమేణా చనిపోయిన వ్యక్తి ముక్కు, చెవి లేదా ఇతర భాగాలపై బంగారు ముక్కలను ఉంచడం లేదు. ఒకవేళ శరీరం మీద ఉంటే.. దహన సంస్కారాల ముందు తీసి వేస్తారు. ఇది కూడా ఇంటి ఆడ బిడ్డలకు ఇస్తారు. చనిపోయిన వ్యక్తి గుర్తుగా దాచి పెట్టుకుంటారు.

ముక్కు లేదా చెవులపై దూది పెట్టడం వెనుక మరో కథ కూడా ఉంది. దీని ప్రకారం మరణం తర్వాత యమధర్మరాజు ఒకరి ఆత్మను అతని శరీరం నుండి వేరు చేస్తాడు. ఆత్మ తిరిగి శరీరంలోకి ప్రవేశించే మార్గాన్ని కనుగొంటుంది. అటువంటి పరిస్థితిలో మళ్ళీ లోపలికి రాకుండా ఉండటానికి ముక్కు, చెవులలో పత్తిని ఉంచుతారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version