వావ్..ఈ చిన్నారి టాలెంట్ కు లైక్ వేసుకోవాల్సిందే..నెటిజన్లు ఫిధా..

-

చిన్నారులు చిచ్చర పిడుగులు అని తెలిసిందే..ఇటీవల ఎంతో మంది చిన్నారులు వివిధ రంగాల్లో రానిస్తున్నారు. వారిలోని ప్రతిభను ప్రపంచానికి తెలియజెస్తున్నారు.. కష్టసాధ్యమైన పనులు చేస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు.సోషల్ మీడియాలో చిన్నారులకు సంభందించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి..అందులో కొన్నిటిని చూస్తే మాత్రం అవాక్కైపోతారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కోడుతుంది.. ఓ చిన్నారి గుక్క తిప్పుకోకుండా జిల్లాల పేర్లు చెప్పింది..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక 38 సెకెన్ల లో రాష్ట్రం లోని 75 జిల్లాల పేర్లన్నీ చెప్పేసింది. అది కూడా అక్షరక్రమంలో. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. చిన్నారి ట్యాలెంట్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో అంటూ సామెతలను గుర్తు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

యూపీలోని దియోరియా జిల్లాకు చెందిన మాన్వి చౌరాసియా ఆదర్శ్ ప్రాథమిక విద్యాలయ పాఠశాలలో చదువుతోంది. ఏ తరగతి చదువుతుం తో తెలియదు కానీ ఇటీవల ఈ చిన్నారి యూపీ రాష్ట్రం లోని 75 జిల్లాల పేర్లను అక్షర క్రమంలో చెప్పేసింది. అది కూడా కేవలం 38 సెకన్ల వ్యవధిలోనే.. ఇందుకు సంభందించిన వీడియో  శుభాంకర్‌ మిశ్రా అనే ట్విట్టర్‌ యూజర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘అమేజింగ్ గర్ల్‌. ఈ బాలిక నైపుణ్యానికి మీరు కూడా సెల్యూట్‌ చేస్తారు’ అని ఈ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 26.5 వేల వ్యూస్‌ వచ్చాయి. అలాగే 3వేలకు పైగా లైకులు, 585 రిట్వీట్లు వచ్చాయి.. అమ్మాయికి మంచి భవిష్యత్ ఉందని కామెంట్లు పెడుతున్నారు… మొత్తానికి వైరల్ అవుతోంది… మీరు కూడా ఆ వీడియో పై లైక్ వేసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news