రెండు రోజుల క్రితమే ముగిసిన భారత్ రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నికను నిరసిస్తూ రెజ్లర్లు మళ్లీ నిరసలు ప్రారంభించారు. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న సంజయ్ సింగ్ ఎన్నికలలో గెలవడంతో రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా మరో రెగ్యులర్ బజరంగ పునియా తన పద్మశ్రీని వెనక్కి ఇస్తున్నానంటూ ప్రకటన చేశాడు.
వీరికి మద్దతుగా మరో పారా రెజ్లర్ వీరేంద్ర సింగ్ తన పద్మశ్రీని కూడా వెనుకకి ఇస్తున్నట్టు ప్రకటించాడు.
ఈ దేశ పుత్రిక ,నా సోదరి సాక్షి మాలిక్ కోసం నేను కూడా పద్మశ్రీని వెనుకకి ఇచ్చేస్తున్నాను అని సాక్షి మాలిక్ ని చూసి నేను గర్వపడుతున్నానని తెలిపాడు. అలాగే దేశంలోని ఇతర ప్రముఖ క్రీడాకారులు కూడా తమ అభిప్రాయాన్ని ప్రకటించాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. 2021లో వీరేంద్ర సింగ్ పద్మశ్రీ అవార్డు గెలుచుకున్నాడు.
దీనిపై హర్యానా డిప్యూటీ సీఎం స్పందిస్తూ నిర్ణయాలు భావోద్వేగాల పై ఆధారపడకూడదని ఇటువంటి సంచలన నిర్ణయాలు తీసుకోవడం సరికాదని తెలిపారు.