ఇటీవల ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే..విశాఖ పర్యటనకు వచ్చిన మోదీ..అనూహ్యంగా కలవాలని చెప్పి పవన్‌కు ఆహ్వానం ఇచ్చారు. దీంతో పవన్..మోదీని కలిశారు. ఇక ఏకాంతంగా సాగిన భేటీలో వారిద్దరి మధ్య ఏం చర్చకు వచ్చిందనేది ఎవరికి తెలియదు. కానీ మీడియా మాత్రం ఎవరికి వారు నచ్చిన కథనాలు వేసుకుంటున్నారు.
ఇక పవన్ సైతం..ఏపీలో ఉన్న పరిస్తితులని వివరించానని, ఏపీ అభివృద్ధికి మోదీ కట్టుబడి ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇంకా అంతే అసలు మ్యాటర్ ఏంటి అనేది బయటకు రాలేదు. అయితే మోదీతో పవన్ భేటీ అవ్వడంపై టీడీపీ వర్షన్ వచ్చి..జగన్ అరాచక పాలన గురించి చెప్పి ఉంటారని, ఇక ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరు అని మోదీ చెప్పారని, ఇంకా జగన్ ప్రభుత్వంపై యుద్ధమే అని ప్రకటించారని టిడిపి వర్షన్ ఉంది.
వైసీపీ వర్షన్ వచ్చి మోదీతో భేటీ తర్వాత..పవన్ దూకుడు తగ్గిందని, తమ ప్రభుత్వాన్ని ఎక్కువ తిట్టడం లేదని, అలాగే టీడీపీ మోసకారి పార్టీ అని, ఆ పార్టీతో పొత్తు ఉండదని మోదీ తేల్చి చెప్పేశారని అంటున్నారు. అంటే ఎవరి వర్షన్ వారికి ఉంది..కానీ అసలు నిజం ఏంటి అనేది తెలియడం లేదు. అయితే వైసీపీని గద్దె దించడానికి పవన్ టీడీపీతో కలవడం ఖాయమని అంటున్నారు. అందుకు బిజేపి మాత్రం ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. టిడిపితో కలవడానికి బిజేపి ఇష్టపడటం లేదు.
పవన్ మాత్రం టిడిపితో ముందుకెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం సపోర్ట్ కూడా ఉంటే బాగుంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ పొత్తుల విషయం ఏ మాత్రం క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతానికి ఎవరికి వారు సెపరేట్ గా ఉన్నారు. ఆఖరిగా పొత్తులో ఉన్న జనసేన-బీజేపీలు సైతం సెపరేట్‌గా రాజకీయం చేస్తున్నాయి. మరి చివరికి ఎవరు ఎవరితో కలుస్తారో చూడాలి. అలాగే కేంద్రం మద్ధతు ఎవరికి ఉంటుందో చూడాలి.