తెలంగాణ పదవ తరగతి ప్రధాన పరీక్షలు నిన్నటితో ముగిసాయి. చివరిరోజు సాంఘికశాస్త్రం పరీక్ష సజావుగా నిర్వహించారు. పరీక్షకు 4,86,194 మంది విద్యార్థులకుగాను, 4,84,384 మంది విద్యార్థులు (99.63శాతం) హాజరయ్యారు. ఇక ప్రైవేట్ విద్యార్థుల్లో 443 మందికి, 191 మందే పరీక్ష రాశారు. కాగా, ఈ పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు సెలవులు ప్రారంభం అయ్యాయి.
మే 31వ తేదీ వరకు సెలవులు ఉండగా…. జూన్ ఒకటో తేదీ నుంచి 2023- 24 ఇంటర్ అకాడమిక్ ఇయర్ ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచే ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇక పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం రేపటి నుంచి ఈ నెల 21 వరకు జరగనుంది. ఇక మే పదవ తేదీన పదవ తరగతి ఫలితాలు వెలువడే ఛాన్స్ ఉందని సమాచారం అందుతుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.