126 మంది రైతులు గంజాయి సాగు.. రైతుబంధు వద్ద‌ని అబ్కారీ శాఖ ప్ర‌తిపాద‌న‌లు

-

గంజాయి సాగు చేసే రైతులపై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. గంజాయి సాగు చేసే రైతుల‌పై కేసులు పెట్ట‌డమే కాకుండా.. వారికి రైతు బంధు ప‌థ‌కం అమ‌లు చేయ‌కుండా.. చేస్తుంది. కాగ గ‌తంలో కూడా స్వ‌యంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్.. గంజాయి సాగు చేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని ప్ర‌క‌టించారు. అంతే కాకుండా.. రైతు బంధు ప‌థ‌కాన్ని కూడా అమ‌లు చేయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. కాగ తాజా గా అబ్కారీ శాఖ ప‌లు ప్ర‌తిపాద‌న‌ల‌ను ప్ర‌భుత్వానికి పంపించింది.

రాష్ట్ర వ్యాప్తంగా 126 మంది రైతులు గంజాయి సాగు చేస్తున్నార‌ని తెలిపింది. వారిపై కేసుల‌ను కూడా న‌మోదు చేశామ‌ని అబ్కారీ శాఖ తెలిపింది. కాగ ఆయా రైతుల‌కు రైతు బంధు ప‌థ‌కం అమ‌లు కాకుండా చూడాల‌ని ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపించింది. గంజాయి సాగు చేస్తున్నట్టు అబ్కారీ శాఖ క్షేత్రస్థాయిలో గుర్తించామ‌ని అబ్రారీ శాఖ అధికారులు తెలిపారు. కాగ గంజాయి సాగు ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ ఉందని ప్ర‌భుత్వానికి తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version