గుడ్ న్యూస్.. తెలంగాణలో 1392 జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇన్ని జేఎల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ని తీసుకు రావడం ఇదే మొదటి సారి. 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులని ఇప్పుడు భర్తీ చేస్తున్నారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు డిసెంబర్‌ 16 నుంచి మొదలు కానున్నాయి. 2023 జనవరి 6 వరకు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 2023 జున్ లేదా జూలైలో ఈ పరీక్షని పెడతారు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. అరబిక్‌ పోస్టులు: 2, బోటనీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 15, బోటనీ పోస్టులు: 113, సివిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 1, కెమిస్ట్రీ పోస్టులు: 113, సివిక్స్‌ పోస్టులు: 56, కెమిస్ట్రీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 19, కామర్స్‌ పోస్టులు: 50, సివిక్స్‌ (మరాఠీ) పోస్టులు: 1 వున్నాయి.

అలానే కామర్స్‌ (ఉర్దూ మీడియం) పోస్టులు: 7, ఎకనామిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 15, ఎకనామిక్స్‌ పోస్టులు: 81, ఇంగ్లిష్‌ పోస్టులు: 153, హిస్టరీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 17, ఫ్రెంచ్‌ పోస్టులు: 2, జువాలజీ పోస్టులు: 128, జువాలజీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 18, హిందీ పోస్టులు: 117, హిస్టరీ పోస్టులు: 77, హిస్టరీ (మరాఠీ) పోస్టులు: 1, ఫిజిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 18, మ్యాథమెటిక్స్‌ పోస్టులు: 154, మ్యాథమెటిక్స్‌ (ఉర్దూ మీడియం) పోస్టులు: 9 వున్నాయి. అలానే ఫిజిక్స్ పోస్టులు: 112 , సంస్కృతం పోస్టులు: 10, తెలుగు పోస్టులు: 60, ఉర్దూ పోస్టులు: 28 వున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version