శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 14 లక్షల అక్రమ బంగారం పట్టివేత

-

బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు స్మగ్లర్లు రోజుకో కొత్త మార్గం ఎంచుకుంటున్నారు. క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నా సరే అక్రమార్కులు బంగారం అక్రమ రవాణా చేయడానికి శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనిఖీలలో భారీగా బంగారం పట్టుబడింది. విదేశాల నుండి అక్రమంగా తరలిస్తున్న 14 లక్షల విలువ చేసే అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు.

బంగారాన్ని పేస్ట్ గా తయారుచేసి క్యాప్సిల్స్ రూపంలో కాళ్లకు వేసుకునే చెప్పుల కింద దాచాడు నిందితుడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న అతని కదలికలు అనుమానానికి కారణమయ్యాయి. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న కష్టం అధికారులు స్కానింగ్ చేయడంతో బంగారం గుట్టు రట్టయింది. పట్టుబడ్డ బంగారం 272 గ్రాములు. అంటే 14 లక్షల 28 వేలు ఉంటుందని అంచనా వేశారుఅంచనా వేశారు అధికారులు. బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితుడిని విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news