రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఉచితంగా 15 కిలోల బియ్యం

-

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆగస్టు నెలలో ఆహార భద్రత కార్డులు కలిగిన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పూర్వం సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

సీఎం కేసీఆర్

కరోనా సంక్షోభం ఏర్పడినప్పటి నుంచి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్రం పేదలకు ఒక్కరికి ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. 2022 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఈ పంపిణీ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. అయితే రాష్ట్రం ప్రభుత్వం ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయకుండా అప్పుడప్పుడు కోటాకు కోత పెడుతూ వస్తోంది. గత మే నెలలో మొత్తానికే ఉచిత బియ్యం పంపిణీ ఎత్తివేసింది.

కేంద్ర ప్రభుత్వం కోటా కింద 1.90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని గోదాముల నుంచి లిఫ్ట్ చేసి పేదలకు పంపిణీ చేయలేదు. జూన్ నెలలో కిలోక రూపాయి చొప్పున ఒకరికి 6 కిలోలు పంపిణీ చేసింది. కేంద్రం పంపిన 5 కిలోల ఉచిత బియ్యం మాత్రం ఇవ్వలేదు. అదేంటో తెలంగాణ నుంచి సేకరించే కష్టం మిల్లింగ్ రైస్ ను కేంద్రం నిలిపివేసింది. ఈ నేపథ్యంలోనే జూలై నెలలో 15 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version