నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన.. ఈ ఏడాది దేశంలో 5 జీ టెక్నాలజీ..

-

2022-23 బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నుంచే దేశంలో 5 జీ టెక్నాలజినీ తీసుకువస్తామని వెల్లడించారు. 2022-23 లో డిజిటల్ చిప్ లతో కూడిన  ఈ- పాస్ పోర్టుల జారీకి కొత్త టెక్నాలజీని జారీ చేస్తామని చెప్పారు. 1.2 లక్షల పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్, ఏటీఏం సేవలను ప్రారంభిస్తామని వెల్లడించారు. దేశంలో 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పార్లమెంట్ లో వెల్లడించారు. చెల్లింపుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు ఆన్లైన్ బిల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

బడ్జెట్ లో అన్ లైన్ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు.  పీఎం ఈ- విద్యను 12 నుంచి 200 ఛానెళ్లకు విస్తరిస్తామని వెల్లడించారు. దీని వల్ల అన్ని రాష్ట్రాల్లో స్థానిక భాషల్లో 1 నుంచి 12వ తరగతి దాకా విద్యను అందించేందుకు ఉపయోగపడుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు. రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. పీఎం గతి శక్తి ద్వారా 25 వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని చేపడుతామని ఆమె వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version