ఫ్యాక్ట్ చెక్: 2022 నీట్ పరీక్ష వాయిదా వేసారా..? నిజమెంత..?

-

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ నకిలీ వార్తలు వస్తున్నాయి. ఇటువంటి నకిలీ వార్తలని నమ్మారు అంటే మోసపోతారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేరిట ఒక ఫేక్ సర్క్యులర్ వచ్చింది. అది ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వైరల్ గా మారింది. అయితే ఇక వచ్చిన వార్త ఏమిటి..? అందులో నిజమెంత అనేది దాని గురించి చూద్దాం. 2022 నీట్ పీజీ పరీక్షలు వాయిదా పడుతున్నట్లు అందులో ఉంది.

కరోనా మహమ్మారి కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని అందుకని పరీక్షలను వాయిదా వేసినట్లు దానిలో రాశారు. విద్యార్థుల ఆరోగ్యమే ముఖ్యం అందుకనే ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఒక నకిలీ సర్క్యులర్ జారీ చేశారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.

ఇక ఇది ఇలా ఉంటే పీఐబీ ఫాక్ట్ చెక్ కూడా దీని పైన స్పందించింది. ఇలా వచ్చిన సర్క్యులర్ లో ఎలాంటి నిజం లేదని… ఇది కేవలం ఫేక్ వార్త అని తెలిపింది. కాబట్టి విద్యార్థులు ఇలాంటి వాటిని చూసి అనవసరంగా నమ్మకండి. దీని వల్ల నష్టపోతారు.

సరైన సమాచారం వచ్చేంత వరకు కూడా ఇటువంటి వాటిని చూసి మోసపోవద్దు. అలానే ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మి అనవసరంగా ఇతరులకి పంపకండి. దీని వల్ల మీరు ఇబ్బంది పడతారు ఇతరులు కూడా ఇబ్బంది పడతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version