Breaking : రెండో విడ‌త రాహుల్‌ భార‌త్ జోడో యాత్ర ఖ‌రారు..

-

రెండో విడత ‘భారత్ జోడో యాత్ర’ కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తొలి విడతలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కొనసాగిన విషయం తెలిసిందే. రెండో విడతలో ఈ భారత్ జోడో యాత్ర గుజరాత్ నుంచి ప్రారంభమై మేఘాలయ వరకు కొనసాగనుంది. మ‌హారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా ప‌టోలె మంగ‌ళ‌వారం విలేక‌రుల స‌మావేశంలో ఈ వివ‌రాలు వెల్ల‌డించారు.

రాష్ట్రంలో పార్టీ నేత‌లు, శ్రేణులు రాహుల్ యాత్ర‌కు స‌మాంత‌రంగా మార్చ్ చేప‌డ‌తార‌ని చెప్పారు. రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర రెండో ద‌శ గుజ‌రాత్ నుంచి ఆరంభ‌మై మేఘాల‌యా వ‌ర‌కూ కొన‌సాగుతుంద‌ని తెలిపారు. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 7న రాహుల్ గాంధీ తొలి విడ‌త భార‌త్ జోడో యాత్ర క‌న్యాకుమారిలో ప్రారంభ‌మై జ‌న‌వ‌రి 30న శ్రీన‌గ‌ర్‌లో ముగిసింది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 130 రోజుల పాటు 3970 కిలోమీట‌ర్ల మేర జోడో యాత్ర సాగింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version