ఏపీలోని నిరుద్యోగ యువతకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో త్వరలో 3 లక్షలకుపైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయని సీఎం జగన్ అన్నారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులతో పెద్ద ఎత్తులో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ప్రకటించారు. త్వరలో విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహణ ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. పోర్టులు, ఫిషింగ్ హార్భర్లు, పరిశ్రమలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో ఏపీలో 3లక్షల ఉద్యోగాలు..
-