తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అదేమిటంటే, స్కూళ్లకు ఈ ఏడాది వేసవి సెలవులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ వెల్లడించింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు స్కూళ్లకు ఈ ఏడాది సమ్మర్ హాలిడేస్ ఉంటాయని గతంలోనే విద్యాశాఖ తెలిపింది.
మొత్తం 48 రోజుల సెలవుల అనంతరం.. తిరిగి జూన్ 12వ తేదీన పాఠశాలలు పున: ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. 1 నుంచి 9వ తరగతి విద్యార్ధులకు ఏప్రిల్ 12 నుంచి 20 వరకు సమ్మెటివ్-2 పరీక్షలు జరగనున్నాయి. ఇక ఏప్రిల్ 3 నుంచి 13 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షా సమయం ఉంటుంది.అనంతరం ఏప్రిల్ 25 నుండి వేసవి సెలవులు ప్రారంభంకానున్నాయి.