పాలతో పాటు ఈ ఆహారపదార్ధాలని తీసుకుంటే విషంతో సమానమని తెలుసా..?

-

సాధారణంగా మనం రోజూ పాలు తాగుతూ ఉంటారు. అయితే పాలు తాగేటప్పుడు కానీ పాలు తీసుకోవడానికి ముందు వెనక కానీ ఈ ఆహార పదార్థాలను అసలు తీసుకోకండి. ఎందుకంటే వీటిని తీసుకుంటే అది విషం తో సమానం. అయితే పాలతో పాటు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు. దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది చూద్దాం.

చేప మరియు చికెన్ :

పాలు మరియు పెరుగు ఇలాంటి డైరీ ప్రొడక్ట్స్ తో చేపలు అస్సలు తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల అజీర్తి సమస్యలు వస్తాయి. అలానే చికెన్ కూడా పాలతో పాటు తీసుకోకూడదు. ఈ రెండు ఆహార పదార్థాలను పాలతో తీసుకుంటే గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

మినప్పప్పు :

మినప్పప్పు లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి అయితే ఇది తిరగడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది అయితే పాలతో పాటు దీన్ని తీసుకోవడం వల్ల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కడుపు నొప్పి, వాంతులు, కడుపు బరువెక్కడం వంటి సమస్యలు ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల కలుగుతాయి. కాబట్టి ఈ తప్పు ఎప్పుడూ చేయకండి.

సిట్రస్ ఫ్రూట్స్ :

ఎప్పుడూ కూడా డైరీప్రొడక్ట్స్ లో సిట్రస్ ఫ్రూట్స్ ను తీసుకోకూడదు. కమలా, ద్రాక్ష, నిమ్మ, లిచ్చి మొదలైనవి పాలతో తీసుకుంటే కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలానే ఆహారం విషం కింద మారిపోతుంది.

నువ్వులు మరియు ఉప్పు :

మీరు కనుక వీటిని తీసుకుని ఉంటే అప్పుడు వెంటనే పాలను గాని పెరుగును కాని తీసుకోకండి. కనీసం రెండు గంటల సేపు ఆగండి. ఇది చాలా హానికరం అని నిపుణులు అంటున్నారు.

పనసకాయ లేదా ఆకాకరకాయ :

పనస కాయని, కాకరకాయని కూడా పాలు పెరుగు తో తీసుకోకూడదు. ఇలా చేస్తే దురదలు, సోరియాసిస్ వంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఎప్పుడూ కూడా పాలను తీసుకునేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు. దీనితో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version