హుజురాబాద్ నియోజక వర్గానికి 5 వేల డబుల్ బెడ్ రూం లు మంజూరు చేసి కట్టించే భాధ్యత నాదని.. భవిష్యత్ రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు కృషి చేస్తానని మంత్రి హారిష్ రావు హామీ ఇచ్చారు. హుజురాబాద్ లో జరిగే ఎన్నికి న్యాయానికి అన్యాయనికి ధర్మానికి అధర్మానికి జరిగే ఎన్నిక అని.. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలించింది టీఆర్ ఎస్ ప్రభుత్వం.
డిజీల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజల పై భారం మోపింది బీజేపి ప్రభుత్వమని.. రెడ్డి సోదరుల ఆత్మీయ సభకు పక్క ఊర్ల నుండి తరలించారని రాజేందర్ మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. మందు బిర్యాణీ కోసం వస్తున్నారని హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచే మాట్లాడుతున్నారని.. ఈటలను చిత్తుగా ఓడించాలని పేర్కొన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఈటల బీజేపిలో చేరారని మండిపడ్డారు. బీజేపిలో ఉండి హుజురాబాద్ నియోజక వర్గ ప్రదలకు ఏం న్యాయం చేస్తావ్ ? అని ప్రశ్నించారు. దమ్ముటే కేంద్ర ప్రభుత్వం నుండి పథకాలు తీసుకు రావాలని సవాల్ విసిరారు. ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఆశీర్వదించాలని కోరారు మంత్రి హారిష్ రావు.