కరోనా కాలంలో 6.7 కోట్ల మంది చిన్నారులకు వ్యాక్సిన్లు అందలేదు: యూనిసెఫ్‌

-

కరోనా మహమ్మారి విజృంభించిన 2019-21 సంవత్సరాల మధ్య దాదాపుగా ప్రపంచం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఈ రెండేళ్ల కాలంలో సుమారు 6 కోట్ల 70 లక్షల మంది చిన్నారులు సాధారణ వ్యాక్సిన్లను పాక్షికంగా లేదా పూర్తిగా తీసుకోలేకపోయారని ఐక్యరాజ్య సమితికి చెందిన యూనిసెఫ్‌ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.

దీనివల్ల చిన్నారుల రోగనిరోధకతకు సంబంధించి ఒక దశాబ్దానికిపైగా కష్టపడి సంపాదించిన లాభాలు క్షీణించిపోయాయని పేర్కొంది. ఇది తిరిగి గాడిలో పడటం అనేది పెద్ద సవాలుతో కూడుకున్న వ్యవహారమని తెలిపింది. ముఖ్యంగా దీని ప్రభావం ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలపై అధికంగా ఉందని చెప్పింది.

కరోనా కాలంలో సాధారణ వ్యాక్సిన్లకు అంతరాయం ఏర్పడిన 6.7 కోట్ల చిన్నారుల్లో 4.8 కోట్ల మంది పూర్తిగా టీకాలకు దూరమయ్యారని యూనిసెఫ్ ఆవేదన వ్యక్తంచేసింది. దీనివల్ల పోలియో, మీజిల్స్‌ వంటివి మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం 112 దేశాల్లో టీకా కవరేజీ క్షీణించిందని యూనిసెఫ్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version