హైదరాబాద్‌ లో మరో విషాదం.. పాత బస్తీలో 13 ఏళ్ల బాలుడు అదృశ్యం

-

హైదరాబాద్‌ లో మరో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ లోని పాత బస్తీలో 13 ఏళ్ల బాలుడు అదృశ్యం అయ్యాడు. ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకపోయాడు నసిర్ అనే 13 ఏళ్ల బాలుడు. బాలుడిని బీహార్ కు చెందిన యువకుడు తీసుకెళ్లాలని అనుమానిస్తున్నారు తల్లిదండ్రులు. దీంతో బీహార్ చెందిన యూసఫ్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, పాతబస్తీలోని హుస్సేనీ ఆలం ఫతే దర్వాజాలో నివాసముండే మహమ్మద్ నసీర్ (13) ఈనెల 14 నుండి కనిపించకుండా పోయాడు. సాయంత్రం కూరగాయల కోసం వెళుతున్నాని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లాడు. కానీ రాత్రి వరకు తిరిగి రాలేదు. చుట్టుపక్క ప్రాంతాలలో బంధువుల వద్ద వాకబు చేసినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినవారు పోలీస్ స్టేషన్ లేదా కంట్రోల్ రూమ్ లో సమాచారం అందించగలరని పోలీసులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version