విషాదం.. వృద్దురాలిపై దూసుకెళ్లిన కారు.. నుజ్జునుజ్జు?

-

హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నగర శివారులోని దూలపల్లి వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. దూలపల్లిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఓ వృద్దురాలి కూర్చొని ఉంది. అటుగా వెళ్తున్న ఓ కారు వేగంగా వస్తూ అదుపు తప్పి వృద్ధురాలిపై దూసుకెళ్లింది. దీంతో విగ్రహం దిమ్మకు కారుకు మధ్య వృద్దురాలు నుజ్జునుజ్జగా అయింది. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

వృద్ధురాలు-కారు-ప్రమాదం

కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ మార్చరీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు చిట్టెమ్మగా పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version