మహేశ్వరంలోని తుక్కుగూడలో భారీ అగ్నిప్రమాదం

-

A huge fire broke out in Tukkuguda in Maheswaram: మహేశ్వరంలోని తుక్కుగూడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హార్డ్ వేర్ పార్క్ కంపెనీలో ఇంకా కూడా భారీగా ఎగిసి పడుతున్నాయి మంటలు. కంపెనీలోని ఒకటో నెంబర్ యూనిట్లో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు, మంటలతో ఉక్కిరి బిక్కిరయ్యారు సిబ్బంది.

A huge fire broke out in Tukkuguda in Maheswaram

కంపెనీలో ఉన్న సిబ్బంది మొత్తాన్ని బయటికి పంపించేశారు సెక్యూరిటీ గార్డ్స్. మంటలు ఎత్తుగా ఎగిసిపడుతుండడంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఐదు ఫైర్ ఇంజన్ లు ఏకధాటిగా శ్రమిస్తున్న అదుపులోకి రాలేదు మంటలు. ప్రాణ నష్టం జరగకపోయినా భారీగా అస్తీ నష్టం జరిగిపోయింది. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version