Kalvakuntla Kavitha case: బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇవాళ రౌస్ ఎవిన్యూ స్పెషల్ కోర్టులో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసు విచారణ జరుగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్ర సీబిఐ దాఖలు చేసిన చార్జి షీట్ పరిగణనలోకి తీసుకొనే అంశంపై విచారణ చేయనుంది కోర్టు.
ఢిల్లీ లిక్కర్ కేసులో గతంలోనే బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర పై చార్జ్ షీట్ దాఖలు చేసింది సీబిఐ. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఏప్రిల్ 11వ తేదీన అరెస్టు చేసిన సిబిఐ… అప్పటి నుంచి జైలులోనే ఉంది. ఇక జైలుకు వెళ్లిన అప్పటి నుంచి ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టు బెయిల్ ఇవ్వలేదు. రకరకాల కారణాల తరుణంలో.. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వడం లేదు.