అప్పు తీర్చలేదని యువతితో శృంగారం..ఆ తర్వాత న్యూడ్‌ వీడియోలు తీసి

-

అప్పు తీర్చలేదని యువతితో శృంగారంలో పాల్గొన్న యువకుడు..ఆ తర్వాత న్యూడ్‌ వీడియోలు తీసి ఆ యువతిని బెదిరించాడు. హైదరాబాద్ నడిబొడ్డున కాల్ మనీ తరహా ఘటన మరోటి చోటు చేసుకుంది. అప్పు తీర్చే పరిస్థితి లేకపోవడంతో తో తన కోరిక తీర్చాలని బాధితురాలి పై యువకుడు ఒత్తిడికి దిగాడు. గత్యంతరం లేక యువకుడి తో శృంగారంలో పాల్గొనేందుకు అంగీకారం తెలిపింది యువతి.

ఈ తరుణంలోనే.. యువతికి తెలీకుండా రహస్యంగా వీడియోలు చిత్రీకరించాడు ఆ నిందితుడు. ఆ మరుసటి రోజు తన స్నేహితులకు వీడియోలు చూపించాడు నిందితుడు. తనతో కూడా గడపాలని యువతికి వీడియో పంపారు నిందితుడు స్నేహితులు. లేదంటే వీడియోలు వైరల్ చేస్తామని బాధితురాలికి బెదిరింపులకు దిగారు. యువతి అంగీకరించకపోవడంతో వీడియోలు వైరల్ చేశారు నిందితులు. దీంతో మానసిక క్షోభ భరించలేక షి టీమ్స్ ను ఆశ్రయించింది బాధితురాలు. ఇక షి టీమ్స్ నుండి వివరాలు తీసుకున్న నారాయణగూడ పోలీసులు… పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version