గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు షాక్‌..ఆ డబ్బులు కట్‌ ?

-

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది జగన్‌ సర్కార్‌. గ్రామ, వార్డు సచివాలయాల్లోని 80,000 మంది ఉద్యోగుల నుంచి ప్రతినెల రూ. 6.80 కోట్ల సొమ్మును బృంద జీవిత బీమా ప్రీమియంగా తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం వారికి బాండ్లు మాత్రమే జారీ చేయడం లేదు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగుల ప్రొబేషన్ ను జూలైలో ఖరారు చేశాక, ఒక్కొక్కరి జీతం నుంచి జీవిత బీమా కింద నెలకు రూ. 850 చొప్పున మినహాయించుకుంటున్నారు. ఎవరైనా ఉద్యోగి సాధారణ/ ప్రమాదవశాత్తు మృతి చెందితే ఈ పథకం కింద బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తారు. ఇలా ఐదు నెలల్లో ఉద్యోగుల నుంచి 34 కోట్లు తీసుకున్నారు. ఇప్పటికీ బాండ్లు మాత్రం జారీ చేయలేదు. మరోవైపు ఐదు నెలల వ్యవధిలో పదిమంది మృతి చెందారు. తాము ఎవరిని సంప్రదించాలో తెలియడం లేదని బాధిత కుటుంబాల సభ్యులు వాపోతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version