ఒక్క సారిగా కూలిపోయిన వాటర్​ ట్యాంక్​

-

కొన్ని కొన్ని విషయాలలో అధికారుల నిర్లక్ష్యం వలన భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అంతే కాకుండా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా ఊహించలేని విధంగా ఉంటాయి. ఇలా ఎన్ని ఘటనలు జరుగుతున్నా కానీ అధికారులు మారడం లేదు. అధికారులు తీరు మార్చుకోకపోవడం వల్లే ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఎవరెన్ని విధాలుగా ఆరోపించినా సరే అధికారులకు మాత్రం చీమ కుట్టినట్ల కూడా ఉండకపోవడం గమనార్హం. మనం తరచూ ఎన్ని సార్లు చెప్పినా కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంటారు. ఇలాంటి అధికారుల వలన పెద్ద స్థాయిలో నష్టాలు సంభవిస్తాయి.

 

ప్రస్తుతం గుజరాత్​ రాష్ర్టంలో కూడా ఇటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. జునాఘడ్‌లోని కేశోద్ ప్రాంతం ఖీర్సారా అనే గ్రామంలో దాదాపు నాలుగు దశాబ్దాల కింద నిర్మించిన శిథిలావస్థకు చేరిన వాటర్​ ట్యాంక్​ ఉంది. చోద్యం ఏమిటంటే ఈ వాటర్​ ట్యాంకుతో నే అక్కడి గ్రామస్తులకు నీటి సరఫరా జరుగుతోంది. 1.5 లక్ష్యల లీటర్ల సామర్థ్యం గల ఈ వాటర్​ ట్యాంక్​ ఒక్క సారిగా కూలిపోయింది. అదృష్టవశాత్తు ఆ వాటర్​ ట్యాంక్​ కూలిన సమయంలో దాని చుట్టు పక్కల ఎవరూ కూడా లేరు. లేదంటే పెద్ద స్థాయిలోనే ప్రాణ నష్టం సంభవించి ఉండేది. కానీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో ఈ ఘటన మొత్తం రికార్డు కాగా…. అది ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది. అక్కడ ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. మరో విషయమేంటంటే… 2019వ  సంవత్సరంలో కూడా ఇలాగే గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో ఓ వాటర్ ట్యాంక్ కూలిపోగా… దాని కింద పడి ఐదుగురు అమాయక వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version