రోజు రోజు సమాజంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో అమ్మాయిలను అబ్బాయిలు తన వీడియోలు బయట పెడుతామంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలను వీడియోలు బయటపెడుతానంటూ బ్లాక్‌మెయిల్‌లకు దిగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరోటి చోటు చేసుకుంది. ఓ యువకుడు యువతితో సన్నిహితంగా ఉన్న వీడియోలను కెమెరాలో బంధించి.. ఆ వీడియోలను సదరు యువకుడికి పంపి డబ్బులు డిమాండ్ చేసిందో యువనటిమణీ..
వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి యువతితో సన్నిహితంగా ఉన్న వీడియోలను చూపించి బెదిరింపులకు పాల్పడిన సినీ నటిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ పరిశ్రమలో పనిచేసే యువకుడికి(28) అదే పరిశ్రమకు చెందిన యువతి(25) ఓ వీడియో పంపింది. అందులో అతడు ఓ యువతితో సన్నితంగా సీన్లు ఉన్నాయి.తనకు రూ.5 లక్షలు ఇవ్వకపోతే ఆన్ లైన్ లో వీడియోలను పోస్ట్ చేస్తానని బెదిరించింది. దీంతో అతడు ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు
యువతిని అరెస్ట్ చేశారు.