ఆడపిల్లలకు అందం కళ్లే.. పెద్ద పెద్ద కళ్లు.. మంచి షేప్‌లో ఉండే కనురెప్పలు ఉంటే.. ఫేస్ చాలా బాగుంటుంది. ఈరోజుల్లో చాలామంది అమ్మాయిలు ఐబ్రోస్‌ను షేప్ చేయించుకుంటున్నారు. నెల నెలా వీటిని షేప్ చేయించుకోవాల్సిందే. అప్పుడే ఫేస్ చక్కగా ఉంటుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు వచ్చాయంటే.. నాలుగు రోజుల ముందే.. ఐబ్రోస్‌ను షేప్ చేయించుకొచ్చుకుంటారు. అప్పుడే ఫంక్షన్ నాటికి ఫేస్ బాగుంటుంది అమ్మాయిలంటారు. అయితే ఎవరైనా ఐబ్రోస్‌ను షేప్ చేసుకుంటారు కానీ.. షేవ్ చేసుకోరు కదా.. అసలు ఐబ్రోస్ లేకుండా ఉంటే ఫేస్ ఎలా ఉంటుంది..? అందంగా ఉండటం దేవుడెరుగు.. అంద వికారంగా తయారవుతారు కదా.. కానీ ఆ అమ్మాయి.. మాత్రం డైలీ ఐబ్రోస్‌ను షేవ్ చేసుకుంటుంది.. అలా చేస్తూ వీడియో కూడా తీసుకుంటుందిగా..! ఇంకేముంది.. అది కాస్తా వైరల్ అయింది.
అమెరికాకు చెందిన లిసా అనే యువతి ప్రతిరోజు మేకప్ వేసుకుంటుంది. ఆమె మేకప్ ఆర్టిస్ట్ కూడా. దీంతో రోజుకో రకం మేకప్ వేసుకుని అందరిని ఆకట్టుకోవాలనుకుంది… అయితే, ఆమెకు నుదురు వెంట్రుకలు కాస్త మందంగా ఉంటాయి. దీంతో ఆమె ప్రతిరోజు షేవ్ చేసుకుంటుంది. తన వెంట్రుకలు మందగా ఉన్నందుకు తాను షేవ్ చేసుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం యువతి చేస్తున్న వింత పని నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
దీన్నిచూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. గ్రహంతర వాసిలా ఉన్నావంటూ, రోజు షేవ్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐబ్రోస్‌ను పూర్తిగా తీసేయడం.. మన దేశంలో నేరంగా భావిస్తారు. అలా తీసేయకూడదని చెప్తుంటారు. ఒత్తుగా ఉంటే.. నీట్‌గా షేప్ చేసుకోవాలి కానీ.. ఇలా మొత్తం తీసేస్తారా..? వీళ్లకు బుర్ర ఉందా లేదా అని కొందరు నెటిజన్లు అంటున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసి..మీ అభిప్రాయం కమెంట్ చేయండి.! సోషల్ మీడియాలో ఇలా వింతగా వెరైటీగా ఉండేవే వైరల్ అవుతాయి.