ఆధార్ కార్డులో మార్పులు చెయ్యాలా..? అయితే ఈ నెంబర్ కి ఫోన్ చేసేయండి చాలు…!

-

మనకు వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ వలన చాలా ప్రయోజనాలు వున్నాయి. భారత పౌరుడికి ఆధార్ తప్పనిసరి. పైగా ఆధార్ కార్డు ఎన్నో వాటికి అవసరం. బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడం మొదలు స్కీమ్స్ దాకా పక్కా ఆధార్ కార్డు ఉండాలి. అయితే ఆధార్ లో ఎలాంటి తప్పులు వుండకూడదు. తప్పులు ఉంటే సమస్యలే.

ఆధార్ ని అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎలాంటి వాటికైనా సరే కేవలం ఒక నెంబర్ డైల్ చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… కేవలం ఒకే ఒక్క నెంబర్ కి ఫోన్ చేసి సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు. 1947 నంబర్‌ను UIDAI తీసుకు రావడం జరిగింది. ఏకంగా 12 భాషల్లో మన సమస్యలను ఇది సాల్వ్ చేస్తుంది.

హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ, ఉర్దూలో ఈ నెంబర్ కి కాల్ చేసి పరిష్కరించుకోవచ్చు. #Dial1947 తో మీకు వచ్చిన భాషలో మాట్లాడి సమస్యను సాల్వ్ చేసేందుకు అవుతుంది. డబ్బులు కట్టి ఆధార్ వివరాలను PVC కార్డుపై ప్రింట్ చేసి ఇచ్చే సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version