మీ ఆధార్‌ కార్డ్ ని ఎవరైనా దుర్వినియోగం చేశారేమో అని సందేహమా..? అయితే ఇలా చెక్ చేసేయండి..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ వలన ఎన్నో ఉపయోగాలు వున్నాయి. భారతదేశంలో ప్రతి పౌరుడి గుర్తింపు ధ్రువీకరణలో చాలా కీలకం అయ్యింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే ఆధార్ కార్డు తో అవసరాలు పెరిగిపోతుండటంతో ఆధార్ కార్డ్ మోసాలు కూడా పెరిగిపోయాయి. ఏది ఏమైనా ఆధార్ కార్డు ని భద్రంగా ఉంచుకోవాలి.

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి పలు ఫీచర్స్ ని తీసుకు వచ్చింది. ఇక మరి దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని ఆధార్ కార్డు హోల్డర్లు ఈజీగా తెలుసుకోవచ్చు.

ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ ని ఇలా ఈజీగా తెలుసుకోండి:

మీరు ముందుగా https://uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
నెక్స్ట్ హోమ్ పేజీలోకి వెళ్లిన తర్వాత Aadhaar Services మీద నొక్కాలి.
ఇప్పుడు Aadhaar Authentication History మీద క్లిక్ చేసేయండి.
ఓ పాపప్ విండో వస్తుంది. ఆధార్ నంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సెండ్ OTP పైన నొక్కండి.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తున్న ఓటీపీని ఎంటర్ చేసేసి.. అథెంటికేషన్ టైప్ సెలక్ట్ చేసుకోవాలి.
మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆధార్ అథెంటికేషన్ వివరాలు కావాలో దాన్ని ఎంటర్ చేసేయండి.
అథెంటికేషన్ హిస్టరీని డౌన్‌లోడ్ చేసుకోవాలి….. హిస్టరీని ఓపెన్ చేసేందుకు పాస్‌వర్డ్ అడుగుతుంది.
పేరులోని మొదటి 4 అక్షరాలు, పుట్టిన సంవత్సరం కలిపి ఎంటర్ చేసేస్తే సరిపోతుంది.
మీ ఆధార్ దుర్వినియోగం అయినట్లు గుర్తిస్తే 1947 నంబర్‌కు కంప్లైట్ చెయ్యండి. లేదా help@uidai.gov.in ఇమెయిల్‌ ఐడీకి మెయిల్ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version