కొత్త పెన్షన్ లబ్ధిదారులకు కేసిఆర్ సర్కారు శుభవార్త

-

వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గారు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో తప్ప బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రూ.2016 పెన్షన్ ఇవ్వడం లేదని మంత్రి ఎద్దేవాచేశారు.సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచలో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదామును మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం టీహెచ్ఆర్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన తర్వాత పల్లె ప్రకృతి వనం – మంకీ ఫుడ్ కోర్టును ప్రారంభం చేశారు.

ఆ తర్వాత నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఏంపీపీ మాణిక్ రెడ్డి, మండల, గ్రామ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ..15 ఏండ్ల కింద మొట్టమొదటి వడ్ల కొనుగోలు కేంద్రం రామంచ గ్రామంలో ప్రారంభించాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉత్తమ వడ్ల కొనుగోలు అవార్డు తెచ్చుకున్నామని వెల్లడించారు.

 

సిద్దిపేట నుండి రామంచ వరకు రూ.25 కోట్లతో నాలుగు లేన్ల రహదారి, రామంచ నుంచి చిన్నకోడూర్ వరకూ బీటీ రోడ్డు ఏర్పాటు చేశాం. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేస్తామన్నారు.కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉచితాలు బంద్ చేయాలని చెబుతున్నదని, డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు లేవనీ, ఉచితాలు వద్దని అనుచిత వాఖ్యలు చేసే బీజేపీ సర్కారు బంద్ పెట్టాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version