టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగుస్తుండడంతో బీసీసీఐ గత నెల నుండే కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆశావహుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ పదవిపై సౌతాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓ ఇంటర్వ్యూలో ఏబీడీ మాట్లాడుతుండగా.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని భర్తీ చేస్తారా అన్న ప్రశ్నకు డివిలియర్స్ మనసులో మాట బయటపెట్టాడు. తనకు కోచింగ్ అంటే ఇష్టమేనని.. కానీ ఇప్పుడే ఆ పదవి చేపట్టలేనని అన్నారు. తాను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని, అందుకే ఇప్పటి వరకు కోచ్ పదవి గురించి ఆలోచించ లేదని స్పష్టం చేశారు. కానీ కోచింగ్‌ను తాను ఎంజాయ్ చేస్తానని.. ఫ్యూచర్‌లో కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.కొన్ని జట్లు, కొందరు ఆటగాళ్లతో నేనెప్పుడూ కలిసి పని చేయుటకు ఇష్టపడుతానన్నాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవి అంటే చాలా ఒత్తిడితో కూడికుని ఉంటుందని.. ఆ జట్టుపై భారీ అంచనాలు ఉంటాయని చెప్పారు.