ప్రస్తుతం ఉన్న కాలంలో మన జీవనశైలి, ఆహారం విషయంలో కలిగిన అనేక మార్పుల వలన ప్రతిరోజు ఎవరో ఒకరు ఇలాంటి జబ్బులకు గురి అవుతున్నారు.మనం కడుపు నిండుగా తిన్నప్పుడు లేక అజీర్తి చేసిపొట్టలో నొప్పి రావడం మన అందరికీ అనుభవమే. అయితే కొంతమందిలో పొట్ట నొప్పి తరచూ సమస్యగా మారుతుంటుంది. పొట్టంతా మెలితిప్పినట్టుగా నొప్పి బాధిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. పొట్టలో నొప్పి వేధిస్తున్నప్పుడు ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మన పొట్ట ఒక సమస్య పుట్ట అనడంలో అతిశయోక్తి లేదు. మన పొట్టలో ఉన్న అవయవాలు ఎక్కడ ఉండవు . దీంతో సహజంగానే మనం పొట్టలో సమస్యల తాకిడి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కడుపు నొప్పి అనేది మనలో చాలామందికి అనుభవమే. తరచుగా నొప్పి వచ్చిపోతూ భాదిస్తూ ఉంటుంది. పొట్టలో నొప్పి గనుక వస్థే.. అజీర్తి మొదలుకొని గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ, మలబద్ధకం, అపెండసైటిస్ ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్లు కారణంగా ఉండవచ్చు. మరి ఇలాంటప్పుడు పొట్టలో నొప్పి నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కడుపునొప్పి నివారణ చర్యలు :కడుపునొప్పి వచ్చినప్పుడు వాము లేదా జీలకర్రను నీళ్లలో వేసి కొంచెం సేపు వాటిని స్టవ్ పైన పెట్టి మరిగించి.. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి. దీనివలన నొప్పి నుంచీ కొంచెం ఉపశమనం కలుగుతుంది.ఇది టబుల్ బోర్వెల్ సిండ్రోమ్ కారణంగా గా మలబద్ధకం వల్ల కానీ కలిగే నొప్పి మలవిసర్జన అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల ఉపశమిస్తుంది.చిన్న ప్రేవుల్లో ఏదేని అడ్డంకి కి కారణంగా కలిగే నొప్పి వాంతి జరిగిన తర్వాత కడుపు ఉబ్బరం తగ్గిపోవడంతో తాత్కాలికంగా ఉపశమిస్తుంది.
కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏమి చేయకూడదు :
కడుపులో తరచూ నొప్పి వస్తున్నప్పుడు మన స్వతహాగా మనము ఎలాంటి టాబ్లెట్స్ వాడకూడదు. మనం దానిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.