ఫామ్​హౌస్ కేసు.. నిందితుల కస్టడీపై నేడు ఏసీబీ కోర్టు విచారణ

-

మొయినాబాద్ ఫామ్​హౌస్​ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు ఇవాళ విచారణ జరపనుంది. వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు శనివారం రోజున పిటిషన్‌ దాఖలు చేశారు. ఎంతో కీలకమైన ఈ కేసులో పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉందని, ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే విషయాలు సేకరించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.

ఇప్పటికే నిందితులను రెండు రోజులు కస్టడీకి తీసుకొని ప్రశ్నించినా సరైన సమాచారం సేకరించలేకపోయామని, మరో వారం రోజులు కస్టడీకి అనుమతించాలని పోలీసులు ఏసీబీ కోర్టును కోరారు. పోలీసుల పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని నిందితుల తరఫు న్యాయవాదులను నాంపల్లి కోర్టు ఆదేశించడంతో మంగళవారం రోజున కౌంటరు దాఖలు చేశారు. దీనిపై ఇవాళ వాదనలు వింటామని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version