BREAKING : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. “ఆచార్య” రిలీజ్ డేట్ ఫిక్స్

-

మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభ వార్త అందింది. కరోనా నేపథ్యంలో ఇటీవల వాయిదా పడిన ఆచార్య మూవీ విడుదల తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీని ఏప్రిల్ 29వ తేదీన థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది చిత్రబృందం.

మార్చి 25వ తేదీన ఆర్.ఆర్.ఆర్ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో…. తాము ఏప్రిల్ 29వ తేదీ ని డిసైడ్ చేసుకున్నాము అని చిత్రబృందం ప్రకటించింది. దీంతో ఆచార్య మూవీ ఏప్రిల్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా… ఆచార్య మూవీని… టాలీవుడ్ సంచలన దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా…మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news