నటి చౌరాసియాను ఎవరూ రేప్ చేయలేదు : తేల్చేసిన పోలీసులు

-

హైదరాబాద్‌ లోని కేబీఆర్‌ పార్క్‌ లో నిన్న నటి చౌరాసియా పై గుర్తు తెలియని ఓ వ్యక్తి.. దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే నటి చౌరాసియా కేసులో కొత్త కోణం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం నుంచి నటి చౌరాసియా పై లైంగిక దాడి జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే… ఈ వార్తలను బంజారాహిల్స్ పోలీసులు పూర్తి గా కొట్టిపారేశారు.

నటి చౌరాసియా పై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని బంజారాహిల్స్ పోలీసులు తేల్చి చెప్పారు. కేవలం సెల్ఫోన్ దొంగలించడం కోసమే ఆమెపై దాడి చేశాడని… సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదు కాకపోవడంతో పరిసర ప్రాంతాల కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు. నటి పై అత్యాచారం జరిగినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు బంజారాహిల్స్‌ పోలీసులు. ఎంత వీలైతే అంత తొందరగా నిందితున్ని పట్టుకొని ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు పోలీసులు. కాగా… నిన్నటి దాడిలో నిందితుడు ఫోన్‌ ను లాక్కెళ్లాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version