Kajal Aggarwal: మాతృత్వంపై కాజ‌ల్ ఇంట్రెస్టింగ్ కామెంట్..! ఆ విష‌యంలో చాలా ఎగ్జైట్‌‌‌మెంట్‌ అవుతున్నా… !

-

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. గ‌త ద‌శాబ్ద కాలంగా తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న అందాల చంద‌మామ‌. దాదాపు టాలీవుడ్ లో అంద‌రూ టాప్ హీరోల‌తో న‌టించి, మెప్పించింది. ఈ మిత్ర‌వింద త‌న కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న‌ప్పుడే.. తన మిత్రుడు, ప్రముఖ బిజినెస్‌‌మెన్ గౌతమ్ కిచ్లును వివాహమాడిన సంగతి తెలిసిందే. తన భర్తతో కలిసి ఆనందమైన జీవితాన్ని గడుపుతోంది కాజల్. తన భర్తతో కలిసున్న ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తోంది. ఇటీవ‌ల కాజ‌ల్ యానివ‌ర్స‌రీ కూడా జ‌రుపుకుంది.

అయితే గ‌త కొద్ది రోజులుగా కాజ‌ల్ గ‌ర్భ‌వ‌తి అంటూ.. పుకార్లు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న కాజ‌ల్. తనపై వస్తున్న రూమర్స్ గురించి స్పందించింది. కాజల్ మాట్లాడుతూ.. ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. అయితే ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం ఆ విష‌యంపై కచ్చితంగా మాట్లాడతాను. మాతృత్వం అనేది అంద‌రికి అద్భుత‌మైన అనుభూతి. నా చెల్లి పిల్ల‌ల‌ని చూసి నేను ఇప్ప‌టికే త‌ల్లిలా ఫీల‌వుతున్నానని తెలిపింది.

మ‌రోవైపు.. తల్లి కావాలి అనే భావన నాలో భయాన్ని కలిగిస్తోంది. కానీ నాకంటూ ఓ బిడ్డ ఉంటే జీవితం ఎంతో అందంగా మారిపోతుందని అనుకుంటున్నాని తెలిపింది కాజ‌ల్‌. అదే ఇప్పుడు నాకు పిల్లలు పుడితే ఎలా ఉంటుందనే భావన మరింత ఎమోషన్‏ను పెంచుతుందని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది కాజల్. ప్ర‌స్తుతం కాజ‌ల్ ఉమ‌ అనే సినిమా చేస్తుండాగా, ఇది ఫీల్ గుడ్ హ్యాపీ ఫ్యామిలీ డ్రామా అని చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version