చిన్నపిల్లలకి నేర్పించాల్సిన అతి ముఖ్యమైన విషయాలు పెద్దలు తెలుసుకోవాల్సిందే..

-

చిన్నపిల్లలు ఎదుగుతున్న క్రమంలో పెద్దలు నేర్పే అతి ముఖ్య విషయాలు అందరికీ తెలియవు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల అలవాట్లని, ప్రవర్తనని పట్టించుకోరు. కొందరు తండ్రులు అది తల్లి బాధ్యత అని చెప్పి పట్టించుకోవడమే మానేస్తారు. పెద్దలు నేర్పకుండా పిల్లలే నేర్చుకోవాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. పెద్దలు నేర్పాల్సిన అతి ముఖ్యమైన విషయాలేంటో చూద్దాం.

ప్లీజ్, థ్యాంక్యూ

ఎవరి నుండైనా సహాయం పొందితే థ్యాంక్యూ అని చెప్పడం నేర్పించండి. ముఖ్యంగా రెస్టారెంట్లో ఫుడ్ సర్వీస్ చేసే వెయిటర్స్ కి థ్యాంక్యూ చెప్పాలని చెప్పండి. అవతలి వాళ్ళని గౌరవించాలన్న కనీస కామన్ సెన్స్ వాళ్ళకి తెలుస్తుంది.

చాలా మంది పిల్లలకి ఫోన్ ఎప్పుడు ఆఫ్ చేయాలో తెలియదు. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు సడెన్ గా పెట్టేయడం కరెక్ట్ కాదు. ఈ విషయం చిన్నపిల్లలకి తెలియకపోతే పెద్దలే చెప్పాలి.

ఏదైనా ఫంక్షన్లో పెద్దవారికి సీటు ఇవ్వడం నేర్పించాలి. ఈ విషయంలో చాలా మంది తల్లిదండ్రులు తప్పులు చేస్తుంటారు. పిల్లలని సీట్లో కూర్చోబెట్టి పెద్దలు నిలబడాలి అనుకుంటారు. ముఖ్యంగా ప్రెగ్నెంట్స్ మహిళలు ఉన్నప్పుడు సీటు ఇస్తే బాగుంటుంది. మీకెవరైనా పిల్లలు అలా సీటిస్తే మీరెలా ఫీలవుతారో ఆలోచిస్తే మీ పిల్లలకి నేర్పిస్తారు.

నలుగురు కలిసి భోజనం చేస్తున్నప్పుడు అందరికీ ఫుడ్ సర్వీస్ అయ్యాకే తినాలనే విషయం నేర్పించాలి.

సాధారణంగా పిల్లలు సంభాషణని డిస్టర్బ్ చేస్తుంటారు. వాళ్ళదాకా వచ్చేదాకా మాట్లాడకూడదనే విషయం పెద్దలే చెప్పాలి.

దగ్గుతున్నప్పుడు కానీ, తుమ్మినపుడు కానీ టిష్యూ అడ్డు పెట్టుకోవాలనే విషయం తప్పక తెలియాలి. ఈ కరోనా టైమ్ లో ఇది తప్పనిసరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version