ఈ నెల 30వ తేదీన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాల కోసం https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.32 శాతం.. సెకండియర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైన సంగతి తెలిసిందే. మొత్తం 9,28,262 మంది పరీక్షలు రాయగా.. ఫస్టియర్‌లో 2,94,378 మంది, సెకండియర్‌లో 4,63,370 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇదిలా ఉంటే.. ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు ఈనెల 30వ తేదీన వెల్లడికానున్నాయి. అయితే దీనిపై ఇంటర్మీడియట్ బోర్డు
అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ఫలితాలు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ bie.ap.gov.in లో పొందవచ్చు. లేదా ఇక్కడ క్లిక్ చేసి నేరుగా ఇంటర్మీడియట్ బోర్డు వెబ్ సైట్ లోకి వెళ్లవచ్చు. అధికారిక వెబ్ సైట్ లో రిజల్ట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ 2022 ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆతర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్ బటన్ పై క్లిక్ చేస్తే ఫలితాలు డిస్ ప్టే అవుతాయి. మరోవైపు గోదావరి వరదల్లో ముంపునకు గురై సప్లిమెంటరీ పరీక్షలు రాయలేకపోయిన విద్యార్ధులకు ఇంటర్మీడియట్ బోర్డు తీపి కబురు అందించింది. పరీక్ష రాయలేకపోయినా విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.