కరోనా సెకండ్ వేవ్ నుండి రికవరీ అయిన చాలామంది తీవ్ర అలసటను, బలహీనతను ఎదుర్కొంటున్నారు. 14రోజుల కరోనా పోరాటం తర్వాత నెగెటివ్ వచ్చినప్పటికీ, కరోనా లేకపోయినప్పటికీ బలహీనంగా ఉండడం చూస్తూనే ఉన్నాం. దీన్నుండి బయటపడడానికి సరైన పోషకాహారం చాలా అవసరం. పోషకాహారంతో పాటు కొన్ని టిప్స్ పాటిస్తే కరోనా తర్వాత వచ్చే బలహీనతను చాలా తొందరగా జయించవచ్చు. కరోనా తర్వాత దాని ప్రభావం ఊపిరితిత్తులు, కాలేయంపై అధిక ప్రభావం ఉండనుంది. దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కరోనాకి సంబంధించిన అన్ని నియమాలను పాటిస్తూనే పోషకాహారం, వ్యాయామం పట్ల శ్రద్ధ వహించాలి.
కరోనా నుండి కోలుకున్న వెంటనే తీవ్రమైన వ్యాయామం చేయరాదు. మెల్లగా ప్రారంభించండి. నడక, శ్వాస సంబంధమైన వ్యాయామాలతో మొదలెట్టండి. ధ్యానం చేయండి. శరీరానికి ఎక్కువసేపు విశ్రాంతి ఇవ్వండి.
ఉదయం పూట కనీసం అరగంటపాటు ఎండలో నిలుచోండి.
ఒక ఖర్జూరం, చేతినిండా ఎండుద్రాక్ష, రెండు బాదం, రెండు వాల్ నట్స్ తీసుకోండి వీటన్నింటినీ రాత్రిపూట నానబెట్టి పొద్దున్న పూట తినాలి.
తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోండి. చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ఆహారాలు సహా ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవద్దు.
వారంలో మూడు సార్లు సూప్ తాగండి.
భోజనం చేసిన గంట తర్వాత రోజుకి రెండుసార్లు జీలకర్ర, ధన్యాలతో చేసిన టీ తాగండి.
రాత్రిపూట తొందరగా నిద్రపోండి. ఎంత ఎక్కువ నిద్ర ఉంటే అంత తొందరగా రికవరీ కావచ్చు.
కరోనా నుండి రికవరీ అయ్యి, ఆ తర్వాత వచ్చే అలసట, బలహీనత కారణంగా ఇబ్బందులు పడుతుంటే పై టిప్స్ పాటించి ఆరోగ్యకరంగా ఉండండి.