బాలీవుడ్ స్టార్ హీరో ఓ సినిమా షూటింగులో గాయపడ్డారు. అయినా గాయంతోనే షూటింగ్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఏ సినిమా షూటింగులో గాయపడ్డారంటే..
అక్షయ్‌కుమార్, టైగర్‌ష్రాఫ్ హీరోలుగా నటిస్తున్న సినిమా ‘బడే మియా ఛోటే మియా’. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం స్కాట్‌లాండ్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. హీరోలిద్దరిపై యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. స్టంట్స్ పర్‌ఫార్మ్ చేసే క్రమంలో అక్షయ్‌కుమార్ మోకాలికి తీవ్ర గాయమైందని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది.
అయితే బాధలోనే ఆయన షూటింగ్ పూర్తి చేశారని, ముందస్తుగా ఖరారైన షెడ్యూల్ దృష్ట్యా చిత్రీకరణను పొడిగించలేకపోయామని నిర్మాత జాకీ భగ్నానీ తెలిపారు. గాయం కారణంగా యాక్షన్ సీక్వెన్స్‌కు బ్రేక్‌నిచ్చి అక్షయ్‌కుమార్‌పై కొన్ని క్లోజప్ సీన్లను షూట్ చేశామని దర్శకుడు అలీ తెలిపారు. ఈ చిత్రంలో దక్షిణాది అగ్రహీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.