ఇక పై అన్నింటికి ఒకటే ఛార్జర్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

-

ఇప్పుడు అందరి ఇళ్లలో ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ పెరిగిపోయాయి. ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌, ట్యాబ్స్‌..ఒక్కోదానికి ఒక్కో ఛార్జర్.. ఒక్కోసారి దేనికి ఏ ఛార్జర్‌ అని మనం కన్ఫ్యూజ్‌ అవుతుంటాం.. ఎక్కడికైనా వెళ్లాలన్నా కూడా అన్నీ తీసుకెళ్లాలి.. ఇంకా కొత్తఫోన్లు కొన్నప్పుడు ఈ ఛార్జర్లు అలానే ఉండిపోతాయి. దీని కారణంగా ఈ వేస్ట్‌ బాగా పెరిగిపోతుందని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఎలక్ట్రిక్ పరికరాలన్నీ ఒకే చార్జర్‌తో పనిచేసే విధానం దిశగా కేంద్రప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
కామన్ చార్జర్​ తీసుకురావడంలో సాధ్యాసాధ్యాలు, ఇతర సమస్యలపై అధ్యయనం చేయడానికి నిపుణుల బృందం ఏర్పాటుకు సిద్ధమైందట.. ఒక్కో డివైజ్‌కు ఒక్కో రకం చార్జర్​ కాకుండా, అన్నింటికీ ఒకే రకమైన చార్జర్ ఉండాలి బుధవారం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో మొబైల్స్, ల్యాప్‌టాప్​ తయారీదారులు, సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులు, ఢిల్లీ ఐఐటీ, వారణాసి ఐఐటీ నిపుణులు పాల్గొన్నారు.
కొన్నింటికైనా..  
అన్నింటికీ ఒకటే చార్జర్ కాకపోయినా.. తొలి దశలో రెండు రకాల చార్జర్ల విధానం అమల్లోకి తెచ్చే దిశగా ప్రయత్నించడం మేలని రోహిత్ అన్నారు. ఇందులో సీ-టైప్ చార్జర్ కూడా ఒకటని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు యూజర్లు, తయారీదారుల వాదనల్ని అర్థం చేసుకోవాలని, వాటన్నింటిని పరిశీలించేందుకు నిపుణుల బృందం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మొబైల్స్, ఫీచర్​ ఫోన్స్​, ల్యాప్‌టాప్స్, ఐప్యాడ్స్​, వేరబుల్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్​… ఇలా రకరకాల విభాగాల్లో అధ్యయనం కోసం వేర్వేరు నిపుణుల బృందాలను ఏర్పాటు చేసి… రెండు నెలల్లో నిపుణుల బృందాలు తమ నివేదికలను అందజేసేలా కార్యచరణ రూపొందిస్తున్నట్లు రోహిత్‌ వెల్లడించారు.
ఈ-వేస్ట్ వల్ల కలిగే దుష్పరిణామాల దృష్ట్యా.. అమెరికా, యూరోప్ ప్రభుత్వాలు ఇప్పటికే స్మార్ట్​ ఫోన్లు, ట్యాబ్​‌లకు బ్రాండ్లతో సంబంధం లేకుండా ఒకటే చార్జింగ్ పోర్టు ఉండాలని తయారీ సంస్థలకు స్పష్టం చేశాయి. త్వరలోనే ఆ దిశగా కంపెనీలు మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. అయితే భారత్​‌లో ఆ రూల్​ లేదు కాబట్టి యాపిల్​ వంటి సంస్థలు తాము ప్రత్యేకంగా రూపొందించిన లైట్‌నింగ్ పోర్ట్​ చార్జర్​లను మన దేశంలో ఎక్కువగా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆవిధంగా చూస్తే.. అమెరికా, ఐరోపా దేశాల్లో తగ్గిన ఈ-వేస్ట్ అంతా​ భారత్‌లోనే పోగుపడే ముప్పు లేకపోలేదు. దీని కారణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా సాధ్యమైనంత త్వరగా కామన్​ చార్జర్ విధానం అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు ఉంది..

Read more RELATED
Recommended to you

Latest news