నిరుద్యోగుల ఆశను పెట్టుబడిగా చేసుకొని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు, మీడియా ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా నిరుద్యోగులు మోసపోతూనే ఉన్నారు. ఉద్యోగం పేరిట డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాదులో చోటు చేసుకుంది. యూకే లో ఉద్యోగం ఇప్పిస్తామని హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తిని నమ్మించి మోసం చేశాడు ఓ చీటర్.
హైదరాబాద్ కి చెందిన యువకునికి యూకే కి చెందిన నకిలీ ఉద్యోగ పత్రాలు పంపించి.. వీసా ఇతర చార్జీల పేరుతో 9.20 లక్షల మోసానికి పాల్పడ్డాడు. మోసపోయానని తెలుసుకున్న యువకుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాడు. దీంతో నిందితుడు నైజీరియన్ ఫ్రైడే బెన్ ను అరెస్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.