ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేగళ్ళపాడు గ్రామంలో ఫామాయిల్ మొక్కల పంపణి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తరువాత దురదృష్టితో వ్యవసాయానికి పెద్దపీఠ వేసిన ఘనత కేసిఆర్ దే అన్నారు. భారత దేశం అబ్బుర పరిచేలా వ్యవసాయ రంగంలో ఉచిత విధ్యుత్ సరఫరా చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని కొనియాడారు సండ్ర.
వ్యవసాయం లాభసాటిగా చేసి, రైతు తల ఎత్తుకొనేలా చేసి రైతు ఆత్మహత్య లేకుండా చేశారని అన్నారు. వ్యవసాయ రంగంలో కేసిఆర్ తీసుకున్న గొప్ప సంస్కరణలు వలనే భారత దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. ఫామాయిల్ గింజలు లేక పెటెంట్ హక్కుల కోసం ఇతర దేశల మీద ఆదారపడి ఉన్నామని.. పామాయిల్ కు టన్ను కు 20 వేలు సబ్సిడి కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఫామాయిల్ ఇంకా అభివృద్ధి చెయ్యోచ్చని అభిప్రాయపడ్డారు.
వేంసూరు మండలం కల్లూరు గూడెం లో25 ఏకారాలు సేకరించి ఫామాయిల్ ఫ్యాక్టరీ కి కార్యచరణ జరుగుతుందని తెలిపారు. ఖమ్మం జిల్లా కు అవసరం అయిన ఫామాయిల్ మొక్కలు సత్తుపల్లి నుండే సరఫరా అవుతాయని.. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.