సీఈసీ రాజీవ్ కుమార్ కి ‘Z’ కేటగిరి భద్రత కేటాయింపు

-

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ కి కేంద్ర హోంశాఖ ‘Z’ కేటగిరి భద్రతను కల్పించింది. ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వీఐపీ భద్రత కల్పించినట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. సీఆర్ఫీఎఫ్ కి చెందిన 40-45 మంది సాయుధ కమాండోలను నియమించింది.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సీఈసీ రాజీవకుమార్ ఆయా ప్రాంతాల్లో తిరగాల్సి వస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాజీవ్ కుమార్ ఎక్కడ పర్యటించినా.. ఆయనతో పాటు కమాండోలు వెళ్తుంటారు. రాజీవ్కుమార్ 1984 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. మే 15, 2022న 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం అవుతుంది. రెండో విడత ఏప్రిల్ 26, మూడో విడుత మే 7,  నాలుగో విడుత మే13, ఐదో విడుత మే 20,  ఆరో విడుత 25, ఏడో విడుత జూన్ 1న జరగనున్నాయి. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version