వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్!

-

ప్రస్తుత రోజులలో యువత స్మార్ట్ ఫోన్లు లేకుండా ఉండలేకపోతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా వీటి వాడుకము విపరీతంగా పెరిగిపోయింది.గతంలో కాల్స్, మెసేజ్‌ల వరకూ ఫోన్లు పరిమితమై ఉండేది .కానీ ఇప్పుడు మరింత స్మార్ట్‌గా మారడంతో అన్ని అవసరాలకు స్మార్ట్ ఫోన్స్ ప్రత్యామ్నాయంగా మారాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్స్‌లో కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. ముఖ్యంగా మెసెజ్‌లను మాత్రమే కాకుండా ఆడియో, వీడియో ఫైల్స్‌తో పాటు యూపీఐ సహాయంతో పేమెంట్ చేసే సౌకర్యాన్ని కలిగించింది.ఇక తాజాగా వాట్స్అప్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించబోతున్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్లో వీడియోల కోసం పిక్చర్ ఇన్ పిక్చర్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ వల్ల యాప్లో షేర్ చేసిన వీడియోలను పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్లో యాప్లోనే చూడవచ్చు. ఓవైపు వీడియోలు చూస్తూ, మరోవైపు చాట్ చేసుకోవచ్చు. వేరే యాప్కి మారినప్పుడు కూడా ఈ మోడ్లో వీడియోలను చూసే వీలుంటుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ఫో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version