యువ హీరో శ్రీ విష్ణు తాజాగా నటించిన “సామజవరగమన” మంచి విజయాన్ని సాధించింది. చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీవిష్ణుకు ఈ సినిమా సక్సెస్ ఆకలిని తీర్చించి. గతవారమే రిలీజ్ అయిన ఈ సినిమాకు అన్యూహ్యమైన స్పందన వస్తోంది. రోజు రోజుకి వసూళ్లు పెరుగుతూ అద్భుతమైన ఫలితాన్ని అందిస్తోంది. బాక్స్ ఆఫీస్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 19 .8 కోట్లు కలెక్ట్ చేసి తన సత్తా చాటిందట. ఓపెనింగ్ రోజు మాత్రం కేవలం రూ. 2 .89 కోట్లకు సరిపెట్టుకోగా, రోజు రోజుకు మౌత్ టాక్ బాగా పనిచేస్తూ వసూళ్లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఫ్యామిలీ అభిమానులు సినిమాను నెత్తిన పెట్టుకున్నారట. శ్రీవిష్ణు కథను నమ్మి సినిమా చేస్తాడు… అందుకే ఈ సారి సినిమాను ఇతన్ని మోసం చేయలేదు.