మళ్లీ ఉద్యోగాల కోత మొదలెట్టిన అమెజాన్‌

-

ఇంతకుముందు అమెజాన్ కంపెనీ లో జరిగిన లే ఆఫ్స్ గురుంచి తెలిసిందే. ఈ కంపెనీ మరోసారి ఉద్యోగుల కోతలు చేపట్టింది. తొలివిడత లేఆఫ్స్‌లో పది వేల పైచిలుకు ఉద్యోగులను ఈ సమస్త తొలగించింది. మలివిడత లేఆఫ్స్ చేపట్టబోతున్నట్టు గత నెలలోనే తెలిపింది. ఈమారు సుమారు 9 వేల మందికి ఉద్వాసన తప్పదని పేర్కొంది. ఈ దిశగా ఇటీవల వంద మందిని తొలగించింది. ఈ నేపధ్యం లో ఆయా ఉద్యోగులకు మెయిల్స్ పంపింది.
ప్రైమ్ గేమింగ్, గేమ్ గ్రోత్, శాన్ డియోగోలో కంపెనీకి చెందిన ఓ స్టూడియోలో కొందరు తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అయితే..వీరి బాధ్యతలను మిగిలిన ఉద్యోగులకు బదిలీ చేస్తున్నట్టు అమెజాన్ గేమ్స్ విభాగం వైస్‌ప్రెసిడెంట్ క్రిస్టోఫర్ హార్ట్‌మన్..ఉద్యోగులకు పంపించిన నోటీసులో తెలియచేశారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం కష్టతరమైనదని వెల్లడించారు ఆయన. సంస్థకున్న ప్రస్తుత ప్రాజెక్టులు, దీర్ఘకాలిక లక్ష్యాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు.

ఉద్యోగం కోల్పోయిన వారితో త్వరలో ఓ మీటింగ్ నిర్వహించి తదుపరి న్యాయపరమైన కార్యాచరణపై చర్చిస్తామని క్రిస్టోఫర్ హార్ట్‌మన్ అన్నారు. వారికి పరిహారం కూడా చెల్లిస్తామని అన్నారు ఆయన. అంతేకాకుండా.. ఆయా వ్యక్తులకు సంస్థ తరపు నుంచి హెల్త్ ఇన్సూరెన్స్, ఔట్ ప్లేస్‌మెంట్ సర్వీసెస్ తదితర సేవలు కూడా కొంతకాలం పాటు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version