నువ్వు, మీతమ్ముడు అన్నట్టు “సంబరాల రాంబాబు”నే ! – అంబటి కౌంటర్

-

నువ్వు, మీతమ్ముడు అన్నట్టు “సంబరాల రాంబాబు”నే అంటూ నాగబాబుకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. అంబటి రాంబాబు స్టెప్పులతో సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు స్థానికులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. బంజారా స్టెప్పులతో అదరగొట్టారు.

అయితే, అంబటి రాంబాబు స్టెప్పులపై మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు. సంబరాల రాంబాబు గారు మీరు డ్యాన్స్ మహత్తరంగా చేసారు… పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి వుంటే ఇంకా మహత్తరంగా వుండేది !అంటూ చురకలు అంటించారు నాగబాబు. ఇక నాగబాబు చేసిన ట్వీట్‌ కు అంబటి తన స్టైల్‌ లో రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చారు. నువ్వు, మీతమ్ముడు అన్నట్టు “సంబరాల రాంబాబు”నే !కానీ…ముఖానికి రంగు వేయను ప్యాకేజి కోసం డాన్స్ చేయను అంటూ ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు అంబటి రాంబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version