వైసీపీ మంత్రి అంబటి రాంబాబు, టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమా మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకరు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి కాగా, మరొకరు ప్రస్తుత నీటి పారుదల శాఖ మంత్రి. ఇటీవల అంబటి మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పోలవరం అంశంలో ఇరువురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
అయితే తాజాగా దేవినేని ఉమా ఓ ట్వీట్ చేసి వెంటనే తొలగించారంటూ అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ ట్వీట్ పెట్టి డిలీట్ చేసిన మాట వాస్తవం కాదా? ధైర్యం ఉంటే చెప్పు ఉమా అని అంబటి ప్రశ్నించారు. అంతేకాదు దేవినేని పోస్ట్ చేసి తొలగించారు అంటున్న ట్వీట్ ని కూడా పంచుకున్నారు.ఆ ట్వీట్ లో” ఒక్క చోట కూడా గెలవని సన్నాసులు మాకు ఆప్షన్లు ఇవ్వడం చూస్తుంటే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి వెళతాను అన్నది అంట” అని పేర్కొన్నారు. ఇటీవల జనసేనని తన ప్రసంగంలో పొత్తుల అంశంలో మూడు ఆప్షన్లు ఇవ్వడం తెలిసిందే.
ఈ ట్వీట్ పెట్టి,డిలీట్ చేసిన మాట
వాస్తవమా, కాదా ? ధైర్యముంటే చెప్పు @DevineniUma pic.twitter.com/dC94JWtHH3— Ambati Rambabu (@AmbatiRambabu) June 6, 2022