ఆమ్‌పన్నా డ్రింక్‌.. పచ్చిమామిడికాయతో ఇమ్యునిటీ బూస్టర్‌..!

-

సమ్మర్‌ అంటేనే మామిడిపండ్ల సీజన్.. రకరకాల మామిడిపండ్లు మార్కెట్‌లోకి వచ్చేస్తాయి.. వాటిని తింటూ ప్రజలు భలే ఎంజాయ్‌ చేస్తారు. కొందరికి పండిన మామిడిపండ్లు అంటే ఇష్టం ఉంటే..మరికొందరికి పచ్చిమామిడికాయ అంటే ఇష్టం ఉంటుంది. కట్‌ చేసుకుని లైట్‌గా ఉప్పుకారం చల్లుకుని తినేస్తారు. అయితే పచ్చిమామిడికాయలను ఎక్కువగా తినొద్దని అంటారు. కడుపునొప్పి వస్తుందని మన పెద్దోళ్లు చెప్పే మాట.. పచ్చిమామిడికాయతో కూడా చలవ చేసే, మంచి పోషకాలను అందించే, బాడీ డీటాక్సిఫికేషన్‌కు ఉపయోగపడే విధంగా డ్రింక్‌ చేసుకుని తాగొచ్చు. ఈరోజు మనం పచ్చిమామిడికాయతో ఆమ్‌ పన్నా డ్రింక్‌ ఎలా చేయాలో చూద్దామా..!

ఆమ్‌ పన్నా డ్రింక్‌ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

పచ్చిమామిడికాయ ముక్కలు అరకప్పు
పుదీనా పావుకప్పు
కొత్తిమీర పావు కప్పు
తేనె రెండు టేబుల్‌ స్పూన్స్‌
లెమన్‌ జ్యూస్‌ ఒక టీ స్పూన్
పచ్చిమిర్చి ముక్కలు ఒక టేబుల్‌ స్పూన్‌

తయారు చేసే విధానం..

ముందుగా మామిడికాయను తొక్కతీసేసి ముక్కలు కట్‌ చేసుకుని మిక్సీ జార్‌లో వేసుకుని పచ్చిమిరిపకాయలు, కొత్తిమీర, పుదీనా వేసి గ్రైండ్ చేయండి. అందులో నిమ్మరసం, తేనె వేసి మళ్లీ గ్రైండ్‌ చేయండి. ఇమ్యునిటీకి ఈ డ్రింక్‌ బాగా హెల్ప్‌ అవుతుంది. షుగర్‌ పేషంట్స్‌ కూడా ఈ డ్రింక్‌ తాగొచ్చు. మీ ఇంట్లో చిన్న కుండ ఉంటే.. అందులో నీళ్లు పోసి.. ఆ నీళ్లు చల్లగా అయ్యాక.. ఈ పేస్ట్‌ వేయండి. ఎండనపడి వచ్చినప్పుడు ఇది గ్లాస్‌ తాగితేచాలు చాలా రిలీఫ్గా ఉంటుంది. సమ్మర్‌లో ఇంటికి ఎవరైనా వస్తే.. అందరూ.. కూల్‌డ్రింక్స్‌ ఇస్తారు. మీరు ఇలా చేసి ఇచ్చారంటే… వాళ్లు చాలా ఎంజాయ్‌ చేస్తారు.! ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అంటే ఇదే కదా..!

అయితే ఇలాంటి డ్రింక్స్‌ ఎప్పుడు తాగాలన్నా.. డిన్నర్‌ చేయడానికి గంటముందు కానీ, లంచ్‌ కు అరగంట ముప్పావుగంట ముందు కానీ తీసుకోవచ్చు. పొట్టలో అప్పటికే ఆహారం ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి డ్రింక్స్‌ తాగకూడదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version